23

23
You will Never have many problems in life with things you reject blatantly but you ought to be careful with truths You AGREE as those CHOICES will dictate your Life

Blog Index

Search This Blog

HOME

Jul 4, 2024

Telugu Poetry BY Dr Archana Advocate

 మండుతున్న  సూర్యుని మధ్యలో  పయనింపు నీ ధ్యేయాన్ని 

ఆ కిరణాల వెలుగుల నుండి నీ ఆత్మశక్తిని చిగురింపు  

నీవే ఒక ఇంద్రధనుస్సు వై  నీ ఆత్మగౌరవాన్ని ప్రజ్వలింపు 


నీ హృదయలోతులలో ఉన్న నీ ఆత్మబలాన్ని బయటికి రప్పించు 

గతాన్ని వదిలిపెట్టి ,నీ అద్భుతమైనా రేపటిని స్వాగతించు 


నీ ముందున్న జీవితం పై ద్రుష్టి సారించు 

నీ పదునైన ఆలోచనలతో సరికొత్త మార్పులను ఆహ్వానించు 


నీ సొంత కళలను చిత్రించు 

నీ సొంత శక్తి తోనే పయనించు 


నీ జ్ఞానం తోనే చీకటిలో వెలుగు నింపు 

నీ ఉగాదిపచ్చడిలోని అన్నీ రుచులని అనుభవించు 

నీ జీవిత కష్టాసుఖాలన్నిటిని భరించు 

నీ తెరను తొలగించి నువ్వెంటో ప్రపంచానికే చూపించు 


నీలో ఉన్న నువ్వు ఎవరో కనిపెట్టు 

నీలో ఉన్న మృదుత్వాన్ని కఠినత్వాన్ని కాసేపు పక్కనపెట్టు 

చెడుతో రాజీ పడితే చేదు చెడునే  గెలిచినట్టు 

చెంబుడు పాలలో ఒక్క చుక్క సైనైడ్ వెస్థే చావే మిగిలినట్టు 


డేగ లా వర్షానికి ఎదురుపడి వెళ్లు 

కారుచీకట్లే నీమీద భయంతో తుళ్లు 


కన్నీళ్లకు సమయం లేదు 

దుఃఖానికి సమయం రాదు 


అద్భుతమైన రేపటి కోసం పరుగులాడు 

మనస్ఫూర్తిగా మార్పుల కోసం పాకులాడు 


 ఎవ్వరు లేరు నీకంటే ఎక్కువగా నీకోసం పోరాడే ధీరుడు 

నీ సొంత అత్మబలం తో  నువ్వే కావాలి ఆ వీరుడు 



No comments:

Post a Comment

Can't handle timepass comments anymore

Note: Only a member of this blog may post a comment.